ATP: రానున్న న్యూ ఇయర్ సందర్భంగా గుంతకల్లులో డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో మద్యం షాపులు మూసివేయాలని కోరుతూ ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన్ టౌన్ సీఐ మనోహర్‌కు వినతి పత్రం అందజేశారు. ఐద్వా మహిళా అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు.