WGL: నర్సంపేట మున్సిపాలిటీ 1వ వార్డులో మిషన్ భగీరథ నీటి సమస్యల పరిష్కారానికి మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం చొరవ చూపారు. ఇవాళ పలు ప్రాంతాల్లో లీకేజీలు మరమ్మతు చేయించి.. కొత్త కనెక్షన్లు లేని ఇళ్లకు నీటి సరఫరా అందించారు. వాటర్ ట్రయల్ రన్ నిర్వహించి ఇంటింటా పరిశీలించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.