కొన్ని జంతువులు అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుంటాయి. ముఖ్యంగా ఒరంగుటాన్లు, చింపాంజీలు, బోనోబోలు(ఆఫ్రికన్ కోతులు) మనుషుల్లాగే ప్రేమను వ్యక్తం చేస్తాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇవి మనుషుల్లాగే తమ భాగస్వామిని ముద్దుపెట్టుకుంటాయి. ఇవే కాకుండా ఉడతలు, ఫ్లెమింగోలు, డాల్ఫిన్లు వంటివి కూడా తమదైన శైలిలో ముద్దులతో ప్రేమను చాటుకుంటాయి.