MNCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి డిమాండ్ చేశారు. కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సీపీఎం ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆదివారం చెన్నూర్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గెలిచిన ప్రజాప్రతినిధులు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు.