కృష్ణా: ఈ నెల 29వ తేదీన సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. అర్జీల రూపంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.