నిర్మల్ జిల్లా నూతన అదనపు ఎస్పీగా పత్తిపాక సాయికిరణ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్డీపీవో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఆయన, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.