NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం నిర్వహించిన 63వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు, డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావాలి రెడ్డి తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే తన తండ్రి దస్తగిరి రెడ్డి లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ 1000 మందికి ఉచిత వైద్యం అందించామన్నారు.