BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 2007-2008 బ్యాచ్ (7వ తరగతి) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకుని సంతోషంగా గడిపారు. అనంతరం విద్యార్థులు గురువులను శాలువాలతో సన్మానించారు. పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ గడిపిన సమయం అమూల్యమని విద్యార్థులు పేర్కొన్నారు.