MBNR: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ విజయాలు సాధించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం జడ్చర్లలో విజేతలను సన్మానించారు. రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు కారు గుర్తుకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.