NDL: దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన వైసీపీ నేత కాకర్ల మోహన్ నాయుడు తండ్రి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యం చెప్పారు.