సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జీ. వీ.వీ గార్డెన్లో రేపు జరిగే సీపీఎం జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి, ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నారని జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీపీఎం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.