NRML: సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని అన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులను ప్రజావాణి ద్వారా అందించాలన్నారు.