నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 635 స్థానాలకు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 298 మంది పోటీ చేయగా అందులో దాదాపు 100 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గెలిచిన సర్పంచులకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అభినందన సభను మాధవ్ నగర్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.