NLR: పేదలకు ఇచ్చే ఇల్లు విషయంలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో నిర్మాణం జరిగిన ఇళ్లను సైతం చంద్రబాబు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.4లక్షలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మొఖం చాటేశారని,కాకాణి గోవర్ధన్ విమర్శించారు.