TG: ఉపాధి హామీకి గాంధీ పేరు తొలగింపు దుర్మార్గమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. దేశ వనరులు, సంపద ప్రజలకు పంచాలని.. గాంధీ పేరు పెడితే బీజేపీ నేతలు తొలగించారని అన్నారు.