KNR: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని, అతివేగం వల్ల ప్రమాదాల బారిన పడవద్దని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి.