KRNL: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పానాటూరు పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్-బస్సు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కర్నూలుకు చెందిన అయ్యప్ప భక్తులు కేరళ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. దారి మధ్యలో వారి బస్సును కంటైనర్ ఢీకొంది. కంటైనర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, చీలాపల్లి సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.