KMM: కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ భవనం ఎంతో ఉపయోగకరమని వారు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, మాజీ ఎంపీటీసీ జగన్నాథరెడ్డి, ఉప సర్పంచ్ గోపి, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.