RR: విద్యాభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ సర్పంచ్ వసుంధరమ్మ తనయుడు సిద్ధార్థ రెడ్డి అన్నారు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.6లక్షల 50 వేల సొంత ఖర్చులతో అభివృద్ధి పనులను చేయించారు. ఆయన మాట్లాడుతూ.. తరగతి గదుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అనుకూల వాతావరణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించానన్నారు.