MBNR: నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజాజీవనానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడారు. డిసెంబర్ 31 రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు, నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే రీతిలో వేడుకలు జరపవద్దని ఎస్పీ స్పష్టంచేశారు.