BDK: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండాను భట్టి విక్రమార్క మల్లు ఆదివారం ఎగురవేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలతో దేశాన్ని ముందుకు నడిపించిందని డిప్యూటీ సీఎం అన్నారు.