BHPL: నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. BHPL జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశంలో SP పాల్గొని మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.