తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కించిన సినిమా ‘జన నాయగన్’. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు వినోద్ స్పందించాడు. అందులో నిజం లేదని, ఇది విజయ్ ఒరిజినల్ సినిమా అని చెప్పాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.