VKB: జిల్లాలో వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గి పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. దీంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. వాటిని కాల్చకుండా పొలంలోనే దున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా మారి పంట దిగుబడి పెరుగుతుందని సూచించారు. పంటలకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా, ఇతర జీవులు చనిపోవడంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందన్నారు.