KMM: మధిర మున్సిపాలిటీలో నూతన భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహానగరంగా ఎదుగుతున్న మధిరను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని అన్నారు. పౌర సేవలకు ఇబ్బందులు లేకుండా ఆధునిక భవన నిర్మాణం చేపడతామని తెలిపారు.