VZM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ గిరడ అప్పలస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని జన్నివలస, తారాపురం గ్రామాల్లో పర్యటించిన అప్పలస్వామి, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల నాయకులు పాల్గొన్నారు.