ATP: అనంతపురం సంగమేశ్ కాలనీకి చెందిన పార్వతీశ్వరయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన కుమారుడు భాను ప్రకాశ్ నేత్రదానానికి ముందుకొచ్చారు. సమాచారం అందుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నేత్రాలను సేకరించారు. ఈ నేత్రదానంతో ఇద్దరికి చూపు లభించనుంది. కుటుంబ సభ్యులను సొసైటీ అభినందించింది. కార్యక్రమంలో టెక్నీషియన్ రాఘవేంద్ర, వాలంటీర్ బాలకృష్ణ పాల్గొన్నారు.