సత్యసాయి: సోమందేపల్లి మండలం రూకలపల్లి గ్రామంలో శ్రీ భక్త కనకదాసు విగ్రహావిష్కరణ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో మహిళలు, చిన్నారులు జ్యోతులను తయారు చేసి ఉపవాస దీక్షలతో భక్తిశ్రద్ధలతో జ్యోతులు మోశారు. ఊరేగింపుగా వెళ్లి జ్యోతులను విగ్రహానికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరం నెలకొంది.