HNK: వరుసగా ATMలో చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో CI సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో నిఘా పెంచిన పోలీసులు, 4 రోజుల క్రితం ఓ ATMలో డబ్బులు కాజేస్తున్న ఒకరిని పట్టుకుని విచారించగా మిగతా ఆరుగురు వివరాలు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.