BPT: జిల్లాల విభజన అనంతరం బాపట్ల జిల్లా 7 నియోజకవర్గాలతో ప్రారంభమై 5 నియోజకవర్గాలతో నిలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో SNపాడు నియోజకవర్గం విభజించి ప్రకాశంలో కలిపారు. ప్రస్తుతం ఆరు నియోజకవర్గాలతో కొనసాగుతున్న బాపట్ల జిల్లా మరో నియోజకవర్గాన్ని కోల్పోయి 5నియోజకవర్గాలకు పరిమితం కానున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపద్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.