EG: కడియపులంకలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎక్స్ పీరియన్స్ సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక యువత శనివారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గ్రామంలోని 80 సెంట్ల భూమిని టూరిజం శాఖకు కేటాయించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. సదరు స్థలం దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా ప్రాంగణంగా, గ్రామస్థులకు ఏకైక వేదికగా ఉందని పేర్కొన్నారు.