ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తన్నూరు గ్రామస్థులు ఒక్కసారిగా బొగ్గు నిర్వహణ ప్లాంట్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహించిన నిరసనకారులు పోలీస్ జీప్, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సుమారు 10 మంది గ్రామస్థులు, పోలీసులు గాయపడ్డారు.