TG: శంషాబాద్ వస్తున్న రెండు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. జెడ్డా, కొచ్చి నుంచి వస్తున్న ఇండిగో విమానాల్లో RDX అమర్చినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలను ల్యాండింగ్ చేశారు. కాగా, ఇటీవల వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండటంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.