సత్యసాయి: కూరగాయలు, నిత్యావసరాల ధరల భారంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు చికెన్, గుడ్ల ధరలు మరింత భారంగా మారాయి. సత్యసాయి జిల్లాలో ఆదివారం స్కిన్ చికెన్ కిలో రూ. 235, స్కిన్లెస్ రూ. 267కు విక్రయమైంది. గత వారంతో పోలిస్తే ధరలు పెరిగాయి. సంక్రాంతికి ఇంకా పెరుగుతాయేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.