కృష్ణా: CITU 18వ మహాసభల పిలుపులో భాగంగా శనివారం గన్నవరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.