ATP: అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి ఐజీగా పదోన్నతి లభించింది. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమెకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొత్త పోస్టింగ్ వచ్చే వరకు ఆమె అనంతపురం డీఐజీగానే బాధ్యతలు నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.