ASF: పాడేరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా కే.పాపినాయుడు శనివారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన సురేష్ డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. డుంబ్రిగుడలో పనిచేస్తున్న ఎస్సై పాపినాయుడు పాడేరు ఎస్సైగా బదిలీపై వచ్చారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పాపినాయుడు మీడియాకు తెలిపారు.