కృష్ణా: తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.