పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పై రోజు రోజుకి అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం బడా బడా స్టార్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు. వేలకు వేలే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఆదిపురుష్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేస్తున్నట్టు సమాచారం.
లక్ష మందికి పైగా అభిమానుల రాకతో.. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Adipurush pre release Event).. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అప్పటి నుంచే ఆదిపురుష్ మేనియా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రతీ ఆదిపురుష్ థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఎమోషనల్ అయ్యాడు డైరెక్టర్ ఓం రౌత్(Director Om Raut). ఇక కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్.. తెలంగాణలో ఏకంగా 10 వేల టికెట్స్ తన తరుపున ఉచితంగా అందించబోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ వారికి మాత్రమే ఈ టికెట్స్ ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇందు కోసం అభిషేక్ అగర్వాల్ పోస్ట్ చేసిన గూగుల్ ఫామ్ నింపి అప్లై చేసుకుంటే చాలు.. నేరుగా వారికే ఆదిపురుష్ టికెట్స్(Adipurush Movie Tickets) పంపించనున్నారు. ఇక ఇప్పుడు మరో పది వేల టికెట్లను ఫ్రీగా అందించబోతున్నాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఆదిపురుష్ సినిమాను ఆర్థిక కారణాలతో చూడలేని పిల్లలకు.. ఈ మూవీని చూపించేందుకు రణ్‌బీర్ కపూర్ పది వేల టికెట్లను బుక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అభిషేక్ అగర్వాల్, రణ్‌బీర్ కపూర్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పది వేల టిక్కెట్లు కొని పేద పిల్లలకు, అభిమానులకు అందించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ స్టార్ హీరోల అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ థియేటర్లకు వస్తే.. ఆదిపురుష్ ఓపెనింగ్స్ రికార్డ్ మామూలుగా ఉండని అంటున్నారు. ఏదేమైనా.. రామాయణం లాంటి గొప్ప ఇతిహాస కథను ఈ జనరేషన్‌కు అందించాలనే క్రమంలో.. స్టార్ హీరోలు వేల టికెట్స్(Adipurush Movie Tickets) ను ఫ్రీ అందించేందుకు ముందుకు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.