TG: CM రేవంత్ భాష మార్చుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. CM హోదాకు తగ్గట్టు నడుచుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు సాధ్యంకాని హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక హామీలను ఎగ్గొట్టారని ఆరోపించారు. GHMCలో డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉందన్నారు. పార్టీలు, నేతలు, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదని చెప్పారు.