AKP: విశాఖలో జరగనున్న సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో అచ్యుతాపురంలో శనివారం 2కే రన్ నిర్వహించారు. ఇందులో సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు.