SKLM: జిల్లాలో గత మూడేళ్ల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 2,398 మంది మృతి చెందారని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2023లో 810, 2024లో 889, 2025లో ఇప్పటివరకు 699 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడమే ప్రధాన కారణాలుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు.