TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్లు, జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందులో భాగంగా 30 సర్కిళ్లను 60కి, డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచారు. జోన్ల సంఖ్య కూడా 6 నుంచి 12కి పెరిగింది. ఈ విస్తరణకు అనుగుణంగా 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ల నియామకం జరిగింది.