NZB: రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో జిల్లాకు చెందిన సయ్యద్ రహమత్ అలీ షాట్ పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా రహమత్ అలీ 70 ఏళ్ల పై వయసు కేటగిరీలో ప్రాతినిధ్యం వహించాడు. షాట్ పుట్‌ను 8.09 మీటర్ల దూరం విసిరి రెండవస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.