PLD: చిలకలూరిపేట పట్టణంలో అర్బన్ పోలీసులు శుక్రవారం రాత్రి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అర్బన్ ఎస్సై చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ నిమిత్తం ఈ తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.