WG: పాలకోడేరు మండలం శృంగవృక్షంలో శనివారం రూ.కోటి నాబార్డ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు డిప్యూటీ స్పీకర్, ఉండి MLA రఘురామ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో MPP చంటిరాజు, వివిధ సొసైటీల ఛైర్మన్ కృష్ణంరాజు, కొత్తపల్లి నాగరాజు, నంబూరి బాలాజీ వర్మ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా రఘురామ పేర్కొన్నారు.