NGKL: బల్మూరు మండలం వీరంరామాజిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామానికి వెళ్లే మట్టి రహదారి గుంతలుగుంతలుగా మరి అధ్వానంగా మారిందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో అత్యవసర సమయాల్లో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నూతన బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నారు.