VSP: ఉత్తరాంధ్ర ప్రజలకు కేజీహెచ్ సంజీవని అని కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి అన్నారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో మరమ్మత్తులు, 70 వీల్చైర్లు, ఫ్యాన్లు, లైట్లు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. కేజీహెచ్ అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ కలిసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.