కృష్ణా: మరో మూడు రోజుల్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గుడివాడలోని వేంకటేశ్వర స్వామి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. జగన్నాథపురంలోని స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జరిగే ఉత్తర ద్వార దర్శనానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ సిద్ధం చేస్తోంది.