KMM: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ డి. రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.